ట్రంప్‌కు మోదీ బంగారు పిఛవాయీ పెయింటింగ్ కానుక

ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బంగారు ‘పిఛవాయీ పెయింటింగ్’ను బహూకరించారు. వస్త్రంపై ఖనిజ రంగులతో గీసే ఈ చిత్రానికి బంగారు పూత అదనపు అందాన్నిస్తుంది. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌కు నీలిరంగు కళాఖండం, జపాన్ ప్రధాని తకాయిచికి బనారసి స్టోల్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్‌కు కశ్మీరీ సిల్క్ కార్పెట్‌ను మోదీ అందజేశారు.
✓ Verified