గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికి

బంగాళాఖాతంలోని అక్వాన్ తుఫాన్ గంటకు 3 కిలోమీటర్ల మందగమనంతో ముందుకు సాగుతోందని ఐఎండీ తెలిపింది. ఇది నవంబర్ 20న ఏపీ తీరాన్ని దాటవచ్చని అంచనా. తుఫాన్ వేగం తక్కువగా ఉండటంతో ఒకేచోట సుదీర్ఘంగా వానలు పడి వరదలు ముంచెత్తే ముప్పు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఏపీతో పాటు ఒడిశా, తెలంగాణ పైనా దీని ప్రభావం ఉండొచ్చని చెప్పారు.
✓ Verified