దిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలు

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం దిండిలో రెండు వర్గాలు కర్రలతో కొట్టుకోవడంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉంది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న రమేష్, కిశోర్ మద్దతుదారుల మధ్య ఈ గొడవ చోటుచేసుకుంది. ఘర్షణ సమయంలో మూడు బైకులను తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు.
✓ Verified