ఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

ఢిల్లీ రాంలీలా మైదానంలో ఈ నెల 28న జరగనున్న ‘ఛలో రాంలీలా మైదాన్’ కార్యక్రమానికి రావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అఖిల భారత కులగణన సమన్వయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆయనను కలిసిన బృందంలో ఓబీసీ జాతీయ నాయకులు ప్రొఫెసర్ సూరజ్ మండల్, డాక్టర్ గౌడ్ కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
✓ Verified