కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో చెలరేగిన మంటల్లో మత్స్యకారుల వలలు, వేట పరికరాలు కాలిపోయాయి. దాదాపు రూ.5 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని, 300 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని జగన్ పేర్కొన్నారు. బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్కారు స్పందించకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
✓ Verified