చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్

ప్రకాశం జిల్లా చీరాల పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ఖైదీలు ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద తప్పించుకుని పారిపోయారు. మధ్యప్రదేశ్‌కు చెందిన వీరు ఒంగోలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసులు వారిని తిరిగి జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
✓ Verified