'ది ముస్లిం 500' 2027 జాబితాలో భారత్ నుంచి 22 మంది ఎంపికయ్యారు. 82 దేశాల నుంచి మొత్తం 509 మందికి ఈ జాబితాలో స్థానం దక్కింది. మన దేశానికి చెందినవారిలో మౌలానా మహమూద్ మదానీ 18వ ర్యాంకు సాధించారు. షారుఖ్ ఖాన్ తొలిసారి జాబితాలోకి వచ్చారు. అమీర్ ఖాన్, షబానా అజ్మీ, ఏఆర్ రెహమాన్, అజీమ్ ప్రేమ్జీ, అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇందులో ఉన్నారు.
ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ను మళ్లీ నియమించినా తనకు అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం స్పష్టం చేశారు. హువాంగ్ వివాహేతర సంబంధాలపై వివాదం రేగిన వేళ ఆయనకు అండగా నిలిచారు. అలిస్ హువాంగ్ చైనా గూఢచారి అనే ఆరోపణలపై ట్రంప్ సందేహం వ్యక్తం చేశారు. ఆమె గూఢచర్యానికి పాల్పడినట్లు తన దగ్గర రుజువులు లేవని తెలిపారు. చైనా నుంచి వచ్చిన అందమైన మహిళలపై గూఢచారులనే అనుమానం సర్వసాధారణంగా మారిందని వ్యాఖ్యానించారు.
జైలులోనే తాను మరణించే ప్రమాదం ఉందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు. తనకు, భార్య బుష్రా బీబీకి అధికారులు తగిన వైద్యం అందనివ్వడం లేదని ఆరోపించారు. కుడి కంటిలో 85 శాతం చూపు పోయిందని, మెదడులో రక్తస్రావం, గుండెపోటు ముప్పు ఉందని తెలిపారు. బుష్రా చూపు కూడా తగ్గుతోందన్నారు.
జైలులో ఏకాంత నిర్బంధంతో తన ఆరోగ్యం దెబ్బతిందని, ప్రాణాలతో బయటకు రాలేకపోవచ్చని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశారు. రక్తపోటు 193కు పెరిగిందని, కుడి కన్ను చూపు 85 శాతం తగ్గిపోయిందని తెలిపారు. రోజుకు 22 గంటలు బంధిస్తున్నారని, తనతో పాటు భార్య బుష్రా బీబీకి వెంటనే వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.