జైలులో ప్రాణాలకు ముప్పు: న్యాయమూర్తులకు ఇమ్రాన్ ఖాన్ లేఖ

జైలులోనే తాను మరణించే ప్రమాదం ఉందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు. తనకు, భార్య బుష్రా బీబీకి అధికారులు తగిన వైద్యం అందనివ్వడం లేదని ఆరోపించారు. కుడి కంటిలో 85 శాతం చూపు పోయిందని, మెదడులో రక్తస్రావం, గుండెపోటు ముప్పు ఉందని తెలిపారు. బుష్రా చూపు కూడా తగ్గుతోందన్నారు.
✓ Verified