ఈనెల 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటనున్న తుపాను

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం బలపడి ఈనెల 20న అతి తీవ్ర తుపానుగా నెల్లూరు-తుని మధ్య తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇది నేడు తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారనుంది. 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వానలు, ఈదురుగాలులు ఉంటాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, తీర ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
✓ Verified