సమాజంలో మార్పే అసలైన విజయం: పవన్ కల్యాణ్

సమాజంలో మార్పు తేవడమే అసలైన విజయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సామాన్యుడిగా జన్మించి ఉన్నత స్థాయికి చేరి, సమాజ సేవ చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ప్రశంసించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన చూపిన తపనను తాను దగ్గరగా గమనించానని తెలిపారు. ఒకరు సాధించిన విజయం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు.
✓ Verified