జైలు నుంచి ప్రాణాలతో రాకపోవచ్చు: ఇమ్రాన్ ఖాన్ లేఖ

జైలులో ఏకాంత నిర్బంధంతో తన ఆరోగ్యం దెబ్బతిందని, ప్రాణాలతో బయటకు రాలేకపోవచ్చని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాశారు. రక్తపోటు 193కు పెరిగిందని, కుడి కన్ను చూపు 85 శాతం తగ్గిపోయిందని తెలిపారు. రోజుకు 22 గంటలు బంధిస్తున్నారని, తనతో పాటు భార్య బుష్రా బీబీకి వెంటనే వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.
✓ Verified