యాపిల్, గూగుల్ సేవలకు అంతరాయం.. యూజర్ల ఫిర్యాదులు

ప్రముఖ టెక్ సంస్థలు యాపిల్, గూగుల్ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఐక్లౌడ్, యాప్‌స్టోర్, వాలెట్, జీమెయిల్ వినియోగించలేకపోతున్నామని అనేక మంది ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి ఈ ఇబ్బంది మొదలైందని డౌన్‌డిటెక్టర్ వెబ్సైట్ పేర్కొంది. సమస్యను సరిచేసే పనిలో ఉన్నామని యాపిల్ ప్రకటించింది.
✓ Verified