ఇజ్రాయెల్ స్పీకర్‌గా మతన్ కహానా ఎన్నిక

ఇజ్రాయెల్ పార్లమెంట్ స్పీకర్ పదవిని ప్రధాని నెతన్యాహు వ్యతిరేక కూటమి కైవసం చేసుకుంది. యషార్ పార్టీ నేత మతన్ కహానా 66-52 ఓట్ల తేడాతో గెలుపొందారు. నెతన్యాహు బలపరిచిన ఓఫిర్ కాట్జ్ ఓటమి పాలయ్యారు. ఈ ఫలితంతో సభ అజెండాను నిర్ణయించడంలో విపక్షాలకు పైచేయి దక్కింది. అక్కడి రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా నిలిచింది.
✓ Verified