షానన్ విమానాశ్రయంలో అమెరికా సీ-130 విమానంపై గొడ్డలితో దాడి (Video)
ఐర్లాండ్ షానన్ విమానాశ్రయంలో నిలిపి ఉంచిన అమెరికాకు చెందిన సీ-130 హెర్క్యూలస్ విమానాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. దాని విలువ రూ. 560 కోట్లు. నకిలీ పేరు చెప్పి భద్రతా తనిఖీలు దాటిన అతడు, గొడ్డలి, గాలియం రసాయనం వాడి వైర్లు, హైడ్రాలిక్ వ్యవస్థలతో పాటు పలు భాగాలను పాడుచేశాడు. విమానం ఇక వినియోగానికి పనికిరాదని నిపుణులు అంటున్నారు. భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకున్నారు.
✓ Verified