రష్యాలో సైనిక విమానం కూలి 19 మంది దుర్మరణం

రష్యా సైనిక రవాణా విమానం సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో నేలకూలడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. ఇంధనం లీకై ఒక ఇంజిన్లో మంటలు అంటుకోవడమే ప్రమాదానికి కారణమని సమాచారం. ప్రమాద దృశ్యాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
✓ Verified