దుస్తుల ఎంపికలో సౌకర్యమే ముఖ్యం: ఫ్యాషన్ నిపుణులు

దుస్తులు కొనేటప్పుడు ఫ్యాషన్‌కు కాకుండా శరీర సౌకర్యానికే పెద్దపీట వేయాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖాదీ, వదులైన దుస్తులు, టీషర్టులు, ట్రాక్ ప్యాంట్లు వేసుకోవాలని, పార్టీవేర్స్ వద్దని అంటున్నారు. ఆఫీసుకు ఫార్మల్ షర్ట్స్, కుర్తీలు, ప్రయాణాలకు టీషర్టులు, లైట్ జాకెట్లు, జీన్స్ మంచివని సూచించారు. నిద్రకు తేలికైన నైట్ సూట్లు, పైజామాలు మేలన్నారు.
✓ Verified