నానక్‌రాంగూడలో అపోలో పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ సంస్థ ప్రారంభం

అపోలో ఆసుపత్రుల డైరెక్టర్(ప్రాజెక్ట్స్) ఉపాసన మంగళవారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అపోలో ఆసుపత్రిలో ‘అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్’ను ప్రారంభించారు. గర్భధారణకు ప్రయత్నించే మహిళలు తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తారని ఆమె అన్నారు. కవలలు పుట్టిన తర్వాత తనకు శారీరక, మానసిక సమస్యలు ఎదురయ్యాయని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
✓ Verified