శ్రీవారి ఆలయ నెయ్యి కోసం 500 ఆవుల కొనుగోలు: ఈవో

శ్రీవారి ఆలయంలో నెయ్యి అవసరాలకు 500 ఆవులను కొంటామని తితిదే ఈవో రవిచంద్ర ప్రకటించారు. స్పెసిఫైడ్ అథారిటీ భేటీ నిర్ణయాలను ఆయన వివరించారు. తిరుమలలో డిసెంబరు 20-29 మధ్య వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. గతేడాది 7.45 లక్షల మంది దర్శించుకోగా, ఈసారి మరో 51 వేల మందికి అవకాశం కల్పిస్తారు. బ్రహ్మోత్సవాల బహుమానంగా ఉద్యోగికి రూ.16,940, ఒప్పంద సిబ్బందికి రూ.8,470 అందజేస్తారు.
✓ Verified