జావాలో తీవ్ర లోపం.. 'జావా4షెల్' బగ్‌ను గుర్తించిన కాలిఫ్

ప్రపంచమంతా ఎక్కువగా వాడే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెమొరీ సిస్టమ్‌లో తీవ్రమైన బగ్ బయటపడింది. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ 'కాలిఫ్' ఓపెన్ఏఐ జీపీటీ-6 ఏఐ మోడల్ సహాయంతో దీన్ని కనిపెట్టి 'జావా4షెల్' అని పేరు పెట్టింది. ఈ లోపాన్ని వాడుకుని హ్యాకర్లు అనవసర ప్రోగ్రామ్‌లు నడిపే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 90 శాతం జావాపైనే ఆధారపడుతున్నాయి.
✓ Verified