ఆపరేషన్ సిందూర్ వేళ పాక్‌కు చైనా సైనిక సాయం: అమెరికా ప్యానెల్

ఆపరేషన్ సిందూర్ జరిగిన సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనికంగా అండగా నిలిచిందని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ తెలిపింది. భారత్ పురోగతిని అడ్డుకునే వ్యూహంలో భాగంగానే జిన్‌పింగ్ సర్కారు సరిహద్దులో సైనిక ఒత్తిడి పెంచుతూ, పారిశ్రామిక సరఫరాలపై ఆంక్షలు పెడుతోందని పేర్కొంది. యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ వార్షిక నివేదికలో ఈ అంశాలు బయటపడ్డాయి.
✓ Verified