ప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామా

చిత్తూరు కార్పొరేషన్‌లో 7వ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా గెలిచిన వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారం కూడా చేయని ఆమె, తనపై ఆరోపణలు వస్తుండటంతో కమిషనర్‌కు రాజీనామా లేఖ అందజేశారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని, పార్టీకి, ప్రజలకు వాస్తవం తెలియజేయడానికే ఈ నిర్ణయమని ఆమె పేర్కొన్నారు.
✓ Verified