రాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవం

బద్వేల్ మండలంలోని రాజుపాలెం పంచాయతీ సర్పంచ్ పదవికి బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆయనతో పాటు 10 మంది వార్డు సభ్యులూ పోటీ లేకుండా గెలిచారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. శనివారం సాయంత్రం స్వర్ణ పుట్టాయపల్లె సచివాలయంలో వీరికి డిక్లరేషన్ పత్రాలు ఇచ్చారు. 7వ వార్డు నుంచి గెలిచిన తంగా సుభాషిణి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
✓ Verified