పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రస్తుతం కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన పన్నిన వ్యూహం ప్రకారం దాడి జరగగా, తమ అనుచరులు దాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. కన్నతల్లిని స్టోర్‌రూమ్‌లో పెట్టిన వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. అప్పట్లో తాను కార్చిన కన్నీళ్లే ఇప్పుడు వరదలా మారి పెద్దారెడ్డిని ముంచెత్తాయని వ్యాఖ్యానించారు.
✓ Verified