‘ఇంటింటికీ యోగా’కు 12 సంస్థల తోడ్పాటు.. ఉచిత తరగతులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఇంటింటికీ యోగా’ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్, పతంజలి తదితర 12 ప్రముఖ సంస్థలు సిద్ధమయ్యాయి. యోగాను ప్రజల రోజువారీ అలవాటుగా మార్చడమే లక్ష్యం. త్వరలో అందుబాటులోకి రానున్న పోర్టల్ ద్వారా రాష్ట్రమంతటా నేరుగా, ఆన్‌లైన్‌లో యోగా, ధ్యానం, ఆరోగ్య అవగాహనపై ఉచిత శిక్షణ ఇస్తాయి.
✓ Verified