బీఎస్ఎన్ఎల్ నుంచి మూడు వాయిస్ ఓన్లీ ప్లాన్లు

బీఎస్ఎన్ఎల్ కొత్తగా మూడు వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.172కు 28 రోజులు, రూ.184కు 30 రోజులు, రూ.190కు క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లతో లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. ప్రతిరోజూ 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా అందుతాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 9 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని ట్రాయ్ నివేదిక వెల్లడించింది.
✓ Verified