ఏఐతో షీ టీమ్స్ నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి కక్ష

షీ టీమ్స్ పేరిట ఏఐ సాయంతో నకిలీ నోటీసు సృష్టించిన యువతి (24)తో పాటు ఆమె స్నేహితుడు హరిపై సైఫాబాద్ పోలీసులు కేసు పెట్టారు. అయిదేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పిన కేపీహెచ్‌బీ కాలనీ యువకుడికి హరి ద్వారా ఆ నోటీసును వాట్సప్‌లో పంపించింది. నిజమని భావించి అతడు విచారణకు హాజరవగా, నోటీసు నకిలీదని గుర్తించిన ఎస్‌ఐ వెంకటేశ్ ఫిర్యాదు చేశారు.
✓ Verified