నాగచైతన్య 25వ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్

నాగచైతన్య 25వ చిత్రంలో కథానాయికగా సాత్విక వీరవల్లి ఎంపికయ్యారని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఆమె తొలి సినిమా ‘ఆకాశంలో ఒక తార’ రషెస్లో నటన నచ్చి ఈ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. క్లాక్స్ దర్శకుడిగా వ్యవహరించే ఈ సినిమాను అల్లు అరవింద్, బన్నీ వాస్ నిర్మిస్తారు. సాత్విక తొలి చిత్రం నవంబర్ 20న రిలీజ్ కానుంది.
✓ Verified