విజయ్ ఆంటోని చెప్పులు వేసుకోకపోవడానికి కారణం ఇదే

నటుడు విజయ్ ఆంటోని చెప్పులు ధరించని కారణాన్ని ఆయన భార్య, నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని బయటపెట్టారు. కుమార్తె మీరా కోసం కొన్న చెప్పులు చూశాక, ఇక జీవితాంతం చెప్పులు వేసుకోకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మీరా వాడిన వస్తువులను ఆమె గదిలోనే గుర్తులుగా దాచుకున్నామన్నారు. మీరా ఇచ్చిన దాదాపు రూ.4వేల వాచీని మాత్రమే ఆయన పెట్టుకుంటున్నారని వివరించారు.
✓ Verified