సెండాఫ్కు వెళ్లి వందేభారత్‌లో చిక్కిన 12 మంది

బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు వెళ్లిన 12 మంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోనే ఉండిపోయారు. కుటుంబ సభ్యులను బోగీలో సీట్లలో కూర్చోబెడుతుండగా ఆటోమేటిక్ తలుపులు మూతపడ్డాయి. రైలు కదలడంతో వారు 139 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. తర్వాత ఓ స్టేషన్లో వారిని కిందకు దించిన అధికారులు, టిక్కెట్లు లేనందుకు రూ.36వేల జరిమానా వేశారు.
✓ Verified