ఐరాసలో పాక్ సైన్యంపై భారత్ ఆరోపణలు

పాకిస్థాన్ సైన్యం ఆ దేశ సహజ వనరులను సొంత ప్రయోజనాలకు దోచుకుంటోందని భారత్ ఐరాసలో ఆరోపించింది. సహజ వనరులపై జరిగిన భేటీలో భారత దౌత్యవేత్త పర్వతనేని హరీశ్ ప్రసంగించారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖనిజాల పెట్టెను చూపించిన ఘటనను ఆయన గుర్తుచేశారు. దోపిడీలో సైన్యం నేరుగా పాలుపంచుకుంటోందని ఇది రుజువు చేస్తోందన్నారు.
✓ Verified