గోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లు

ఆరు జిల్లాల్లో రూ.126 కోట్ల వ్యయంతో గోదావరి పుష్కరాల పనులు జరుగుతున్నాయని దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వెల్లడించారు. 2027 జూన్ 26న మొదలయ్యే పుష్కరాలు జులై 7న ముగుస్తాయన్నారు. 2027 మార్చికల్లా పనులు పూర్తవుతాయని, 12 ప్రాంతాల్లో నదీ హారతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గోదావరి ఒడ్డున సూర్యదేవాలయం, బృహస్పతి ఆలయం కూడా కడతామని చెప్పారు.
✓ Verified