ఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్

సర్కారు కొలువులు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల దగ్గర రూ.7 కోట్లు తీసుకున్న కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) నిమ్మకాయల పెద్దిరాజుకు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం అతడిని గుంటూరు జిల్లా జైలుకు పంపారు. జనసేన నేతలు కేకే, కోటా రుక్మిణి పేర్లు వాడుకుని పెద్దిరాజు, ధరణికృష్ణ ఈ సొమ్ము వసూలు చేశారని విచారణలో బయటపడింది.
✓ Verified