పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడి

ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్ బరిలో ఉన్న చిన్నకోటయ్యపై నామినేషన్ కేంద్రం దగ్గర వైఎస్సార్సీపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నామినేషన్ దాఖలు చేయనీయకుండా అడ్డుకున్నారని బాధితుడి వర్గం ఆరోపిస్తోంది. ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
✓ Verified