లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలు

విజయనగరం జిల్లా గుర్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా టీడీపీకి చెందిన సన్యాసినాయుడు ఎన్నికయ్యారు. అక్కడ టీడీపీ, వైసీపీ బలాబలాలు సమానం కావడంతో అధికారులు లాటరీ తీయగా ఆయనకు అదృష్టం కలిసొచ్చింది. నెల్లూరు జిల్లా సైదాపురంలోనూ లక్కీడ్రా ద్వారానే టీడీపీ అభ్యర్థి పొట్టేళ్ల పార్వతి ఎంపీపీ పదవి దక్కించుకున్నారు.
✓ Verified