అమెరికా F-16ను దెబ్బతీశామన్న ఇరాన్.. ఖండించిన US

తమ క్షిపణి దాడితో అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్‌లో జరిగిన ఈ ఘటనతో పైలట్ అక్కడి ఒక ఎయిర్‌బేస్‌లో విమానాన్ని అత్యవసరంగా దించారని తెలిపింది. ల్యాండింగ్ ప్రదేశాన్ని వెల్లడించలేదు. ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వార్త నిజం కాదని, తమ విమానాలన్నీ క్షేమమేనని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
✓ Verified