నవంబరు 21న క్షీరాబ్ది ద్వాదశి.. ఉసిరి దీపం విశిష్టత

కార్తిక మాసంలోని పవిత్ర పర్వదినమైన క్షీరాబ్ది ద్వాదశి నవంబరు 21న రానుంది. ఈ రోజు పాటించే ఆచారాల్లో ఉసిరి దీపానిది ప్రత్యేక స్థానం. దీనిని వెలిగించడం వల్ల శ్రీ మహా విష్ణువు కృప దక్కి, శాంతి, సౌఖ్యం, లక్ష్మీకటాక్షం లభిస్తాయని భక్తుల నమ్మకం. అన్నం, దీపం, వస్త్రం, గోవు, పండ్లు, నెయ్యి, వత్తులు దానం చేయాలని చెబుతారు.
✓ Verified