ఇందిరమ్మ కుటుంబ బీమాకు ప్రత్యేక యాప్, ఆన్లైన్ నమోదు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కోసం ప్రత్యేక యాప్‌తో పాటు ఆన్లైన్ నమోదు సదుపాయం తెస్తామని తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు. గురువారం సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి పథకాన్ని ప్రారంభించనుండటంతో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. అర్హులైన అన్ని కుటుంబాల నమోదుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాఖల వారీ బీమా పథకాలన్నీ దీని కిందకే వస్తాయన్నారు.
✓ Verified