భూమిని దాటనున్న ఐదు గ్రహశకలాలు.. ముప్పు లేదన్న శాస్త్రవేత్తలు

నవంబర్ 19, 20 తేదీల్లో ఐదు గ్రహశకలాలు భూమి సమీపం నుంచి వెళ్లనున్నాయి. వీటి పరిమాణం 10 నుంచి 120 మీటర్లు. 2026 VA11, 2026 TB84, 2026 VD6, 2018 NE1, 2007 WK3 అని వీటికి పేర్లు ఉన్నాయి. 2026 VA11 అన్నింటికంటే చేరువగా, 33.5 లక్షల కిలోమీటర్ల దూరంలో పయనిస్తుంది. వీటితో భూమికి ఏ ప్రమాదమూ ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
✓ Verified