పెళ్లి చేసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనండి: లీవిట్

అమెరికన్లు వివాహం చేసుకుని ఎక్కువ సంతానాన్ని కనాలని వైట్‌హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పిలుపునిచ్చారు. రానున్న పదేళ్లలో ఇస్లాం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా మారుతుందన్న తాజా నివేదికపై ఆమె ఇలా స్పందించారు. పిల్లల్లో అమెరికాపై ప్రేమను పెంచాలని కూడా సూచించారు. ఆమె మాటలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
✓ Verified