అక్వాన్ తుపాను: కోస్తాంధ్రలో 19, 20 తేదీల్లో కుండపోత వాన

అక్వాన్ తుపాను కారణంగా కోస్తాంధ్రలోని పలుచోట్ల మోస్తరు నుంచి అత్యంత భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. 19, 20 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. 21న కోస్తాతో పాటు రాయలసీమలోని చాలా చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు.
✓ Verified