డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో పట్టుబడ్డాడా?

మెక్సికోలో అత్యంత వాంటెడ్ డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రోను భద్రతా దళాలు పట్టుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సినలోవాలో అమెరికా, మెక్సికో బలగాలు కలిసి నిర్వహించిన ఆపరేషన్లో ఇది జరిగిందని తెలుస్తోంది. దీనిపై అధికారులు ఇంకా ప్రకటన చేయలేదు. ఈ వార్తలతో పలుచోట్ల హింస చోటుచేసుకుంది. నిరసనకారులు రహదారులను అడ్డుకుని వాహనాలను తగలబెట్టారు. ఇసిద్రో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
✓ Verified