చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించింది. బాధితుడి కోర్టు ఖర్చులూ భరించాలని ఆదేశించింది. 2018లో ప్రకాశం జిల్లా వాసి జానకి రామయ్య నుంచి ఆయన రూ.95 లక్షలు అప్పు తీసుకున్నారు. రామయ్య చనిపోయాక ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయన కోర్టుకెళ్లారు.
✓ Verified