గోండియా అడవిలో ఎయిర్‌లైన్ ఉద్యోగిని వర్షా తుర్కర్ హత్య

మహారాష్ట్ర గోండియా జిల్లాలోని బోండ్రాణి అటవీ ప్రాంతంలో ఎయిర్‌లైన్ ఉద్యోగిని వర్షా తుర్కర్ (35) హత్యకు గురయ్యారు. సెలవుల కోసం పుట్టింటికి వచ్చిన ఆమె స్నేహితుడితో కలిసి గుడికి బయలుదేరారు. దోచుకునేందుకు ప్రయత్నించిన దుండగులు కత్తితో దాడి చేశారని స్నేహితుడు పోలీసులకు చెప్పాడు. ఆసుపత్రికి చేర్చేసరికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
✓ Verified