అమెరికాలో రోడ్డు ప్రమాదం: మునుగోడు యువకుడు సాయితేజ మృతి

నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన సాయితేజ (25) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కొడుకైన అతను పై చదువులకు యూఎస్ వెళ్లి, వారం క్రితమే ఉద్యోగంలో చేరాడు. కారు జింకను ఢీకొని నిలిచిపోగా, వెనకాల వచ్చిన వాహనాలు దాన్ని ఢీకొట్టాయి. తీవ్రంగా గాయపడిన సాయితేజను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
✓ Verified