రామాయణ ప్రదేశాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే

శ్రీరాముడు జన్మించిన అయోధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో సరయూ నది ఒడ్డున ఉంది. సీతమ్మ జన్మస్థలం మిథిలను ఇప్పుడు జనక్‌పుర్ అంటున్నారు. ఇది ఉత్తర బిహార్, నేపాల్ తూర్పు ప్రాంతాల నడుమ ఉంది. వనవాసంలోని 14 ఏళ్లలో సుమారు 11 ఏళ్లు రామ, సీత, లక్ష్మణులు యూపీ-ఎంపీ సరిహద్దులోని చిత్రకూట్ అడవుల్లో ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచవటి మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి ఒడ్డున ఉంది.
✓ Verified