ఢిల్లీలో 148 కిలోల అల్ప్రాజోలం పట్టివేత

ఢిల్లీలోని ఘాజీపూర్‌లో మాదకద్రవ్యాలు తయారుచేసే ముఠాను డీఆర్ఐ అధికారులు బయటపెట్టారు. కంప్యూటర్ దుకాణం పేరుతో రహస్యంగా ల్యాబ్ నడుపుతూ డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నట్లు తేల్చారు. అక్కడ దాడి చేసిన అధికారులు 148 కిలోల అల్ప్రాజోలంతో పాటు తయారీకి వాడే 1,046 కిలోల ముడిపదార్థాన్ని సీజ్ చేశారు.
✓ Verified