కర్కర్దూమా మెట్రో స్టేషన్‌లో ఆవు ప్రత్యక్షం

ఢిల్లీలోని కర్కర్దూమా మెట్రో స్టేషన్‌లోకి ఓ ఆవు వచ్చింది. ఎస్కలేటర్ దగ్గర నిలబడిన ఆ ఆవు ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయాణికులకు జరిగిన ఇబ్బందికి క్షమాపణ కోరింది. స్టేషన్ ఆవరణలోకి వీధి జంతువులు చొరబడకుండా చూడాలని సిబ్బందిని మళ్లీ ఆదేశించినట్లు వెల్లడించింది.
✓ Verified