ఆరు రోజుల ఆర్య గోయల్ పేరిట డీమ్యాట్ ఖాతా రికార్డు

దిల్లీలో జన్మించి కేవలం ఆరు రోజులైన ఆర్య గోయల్ దేశంలో డీమ్యాట్ ఖాతా కలిగిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. పాకెట్ఫుల్ స్టాక్‌బ్రోకింగ్ వేదికపై కుటుంబసభ్యులు ఈ ఖాతాను ప్రారంభించారు. గతంలో ఈ ఘనత 12 రోజుల చిన్నారిది. ఆర్యకు 18 ఏళ్లు వచ్చేదాకా తల్లిదండ్రులు ఖాతాను చూసుకుంటారు. కేవైసీ పూర్తయ్యాక ఆమెకే అప్పగిస్తారు.
✓ Verified