ఆర్బీఐ వడ్డీ రేట్లు 75 బేసిస్ పాయింట్లు పెరగొచ్చు: గోల్డ్మన్ శాక్స్

ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను ఇంకా 75 బేసిస్ పాయింట్లు పెంచే వీలుందని గోల్డ్మన్ శాక్స్ అభిప్రాయపడింది. డిసెంబర్లో 25, వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో మరో 50 పాయింట్ల పెంపు ఉండొచ్చని, 2027 రెండో త్రైమాసికం నాటికి ఇది పూర్తి కావచ్చని పేర్కొంది. ఫలితంగా రెపో రేటు 6.25 శాతానికి చేరొచ్చని తెలిపింది.
✓ Verified