రోహింగ్యాలపై మయన్మార్ మారణహోమం చేసింది: అంతర్జాతీయ కోర్టు

రోహింగ్యా మైనారిటీలపై మయన్మార్ మారణహోమానికి పాల్పడిందని 'ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్' చారిత్రక తీర్పు ఇచ్చింది. 2017లో జరిగిన క్రూర సైనిక చర్య సందర్భంగా ఇది జరిగిందని పేర్కొంది. హింసతో దేశం వీడిన రోహింగ్యాలు భద్రంగా, ఇష్టపూర్వకంగా, గౌరవంగా స్వస్థలాలకు చేరేలా అనుమతించాలని ఆదేశించింది. ఒక దేశంపై ఈ కోర్టు మారణహోమం తీర్పు చెప్పడం ఇదే తొలిసారి.
✓ Verified